Telangana : తెలంగాణలో బీసీలకు (బ్యాక్వర్డ్ కస్ట్స్) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో యత్నాలు చేసినా, ఆ దిశగా ఇప్పటికీ స్పష్టత రాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ రిజర్వేషన్ల అంశం మరోసారి కేంద్ర బిందువుగా మారింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఒకటి రెండు రోజులలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం ముందుకు వెళ్లడంలో అసౌకర్యంగా అనుభవిస్తోంది. గతంలో పలు నియమాలు, తీర్పులు, చట్టాల వల్ల ఈ అంశం సాగదీస్తూ వస్తోంది.
Indian Railways: ఇండియన్ రైల్వేస్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టే ట్రైన్ ఏదో తెలుసా..?
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గతంలో బిల్లులను పార్లమెంట్‌కు పంపినప్పటికీ, ఇవి ఇప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు కూడా క్లియరెన్స్ రాలేదు, దాంతో ఎన్నికలు నిర్వహించే సమయంలో రిజర్వేషన్ అమలులో అనేక తలెత్తే సమస్యలపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం, మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల అవసరాన్ని న్యాయపరంగా సమర్థిస్తూ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలోని జనాభా గణాంకాలను ఆధారంగా చూపుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా బీసీ సంఘాలతో, రాజకీయ పార్టీలతో, న్యాయవాదుల తో సంప్రదింపులు జరుపుతూ ఈ అంశంపై చొరవ చూపుతోంది. అయినప్పటికీ, రాజకీయంగా మార్గం చూపాల్సిన కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో, ఈ రిజర్వేషన్లకు సంబంధించిన శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. బీసీ నేతలు ఈ పరిణామాలను ఆవేదనతో గమనిస్తున్నారు. “ఇది వంచన కాక మరేమిటి?” అని కొంతమంది నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి బీసీలు సీట్లకు నోచుకోకుండా ఉండిపోతారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, బీసీ సంఘాలు, రాజకీయ నేతలు మరోసారి సాధన కార్యక్రమాలు, ధర్నాలు, ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల కోసం మరింత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు.