Bathukamma Politics: బతుకమ్మకు రాజకీయ రంగు!

తెలంగాణలో ప్రస్తుతం పండుగల సీజన్. అయితే పండగులను క్యాష్ చేసుకుంటున్నాయి పొలిటికల్ పార్టీలు.

  • Written By:
  • Updated On - September 29, 2022 / 03:27 PM IST

తెలంగాణలో ప్రస్తుతం పండుగల సీజన్. అయితే పండగులను కూడా క్యాష్ చేసుకుంటున్నాయి పొలిటికల్ పార్టీలు. వినాయకుడి చవితిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నాయి పలు పార్టీలు. ఈ నేపథ్యంలో పూల పండగుపై కూడా పొలిటికల్ పార్టీల కన్ను పడింది. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలను జరుపుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యాయి. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబరాలు జరుపుకోగా, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలతో ఆడిపాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన అమ్మమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోను ట్వీట్ చేస్తూ తెలంగాణ మహిళలకు పూల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 1978లో వరంగల్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇందిరాగాంధీ.

తన అమ్మమ్మ వారసత్వాన్ని, తెలంగాణ ప్రాంతీయ పండుగకు అనుబంధాన్ని గుర్తుకు తెస్తూ ప్రియాంక చేసిన ట్వీట్ బహుశా రాష్ట్రంలో జరిగే బతుకమ్మ వేడుకలకు కవిత కు చెక్ పెట్టేలా ఉందని  రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. “తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 1978లో ఓరుగల్లు (వరంగల్) మహిళలతో కలిసి మా అమ్మమ్మ ఇందిరాగాంధీ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఓ మధుర జ్ఞాపకం’’ అని ప్రియాంక ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ఏడాది పొడవునా జరుపుకునే వేడుకల్లో భాగంగా ఇండియా గేట్ వద్ద కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బతుకమ్మ వేడుకలనుఢిల్లీకి తీసుకువెళ్లారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలను రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ఉపయోగించుకునేందుకు పోటీపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రానున్న నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. నిస్సందేహంగా ఢిల్లీ వేడుకల ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది అని ఆమె నొక్కి చెప్పారు.

మరోవైపు, తన భార్య కావ్యతో కలిసి ఇండియా గేట్ కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ కల్చరల్ ను గౌరవిస్తుందని ఆయన చెప్పారు. ఉమ్మడి పాలనలో బతుకమ్మకు తగిన ప్రాధాన్యం దక్కలేదని అన్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పూల పండుగ వేడుకలను కూడా కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సే సీతక్క, మునుగోడు అభ్యర్థి స్రవంతితో కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు వరుసగా బతుకమ్మ పాటలు పాడటం చర్చనీయాంశంగా మారింది.