TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC లక్కీ డ్రా షురూ!

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో #TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది.

Published By: HashtagU Telugu Desk
Tsrtc Dasara Services

Tsrtc Dasara Services

TSRTC: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో ప్రయాణికులు వేయాలి.

బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను సంస్థ అందించనుంది.

ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది.
బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోంది.

  Last Updated: 18 Oct 2023, 11:32 AM IST