Site icon HashtagU Telugu

Bathukamma: క‌నివినీ ఎరుగ‌ని రీతిలో బ‌తుక‌మ్మ సంబ‌రాలు!

Bathukamma

Bathukamma

Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ (Bathukamma) ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంప్రదాయాన్ని, ఆధునికతను మేళవించి ఈసారి బతుకమ్మ సంబరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు.

వైభ‌వంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు

ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలను సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Also Read: Super 4 Contest: ఉత్కంఠ‌భ‌రితంగా ఆసియా క‌ప్‌.. టేబుల్ టాప‌ర్స్ ఎవ‌రంటే?

ప్రత్యేక ఆకర్షణలు, కార్యక్రమాలు

బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, సంస్కృతి, ప్రకృతి, పర్యావరణం థీమ్‌తో కూడిన డిజైన్‌లను రూపొందించాలని మంత్రి కోరారు. వీటిని ప్రతి ఒక్కరూ తమ కాలర్ ట్యూన్‌లు, సోషల్ మీడియా స్టేటస్‌లుగా పెట్టుకోవాలని సూచించారు. ఉత్సవాల అనంతరం పూలు, ఇతర సామాగ్రిని వృధాగా పారబోయకుండా వాటితో పర్యావరణహిత వస్తువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ముఖ్యమైన జంక్షన్లు, టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని సూచించారు. విద్యార్థులంతా ఉత్సవాల్లో పాల్గొనేలా కళాశాల, యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాన కార్యక్రమాల షెడ్యూల్