Barrelakka: లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ, ఎక్కడ్నుంచో తెలుసా

  • Written By:
  • Updated On - January 23, 2024 / 01:12 PM IST

Barrelakka: ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా బర్రెలక్క లోక్ సభ కు పోటీ చేయాలని భావిస్తుందట. అయితే కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో బర్రెలక్కకు గట్టి పోటీ ఉండబోతోంది. బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష నిరుద్యోగ సమస్యపై వీడియో చేసి పాపులర్ అయ్యారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం చాలా కష్టాలు పడింది. ఆమె వీడియో పాపులర్ కావడంతో.. ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎన్నికల్లో కొల్హాపూర్ స్థానం నుంచి పోటీ చేశారు.

చాలా మంది బర్రెలక్కకు మద్దతు ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విస్తృత ప్రచారం కూడా చేసింది. కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయారు. ఆమెకు దాదాపు 6000 వేల ఓట్లు వచ్చాయి. కానీ ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు పెరిగారు. వారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు మరియు కొందరు ఆర్థిక సహాయం చేసారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలని పట్టుదలతో ఉన్న బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేస్తానని బర్రెలక్క చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన గుణపాఠాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తానని బర్రెలక్క అన్నారు. మరి ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. అయితే అక్కడ మల్లు రవి పోటీలో ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.