Site icon HashtagU Telugu

Barrelakka Manifesto : బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు దీటుగా బర్రెలక్క మేనిఫెస్టో

Barrelakka Manifesto

Barrelakka Manifesto

అధికార పార్టీ బిఆర్ఎస్ , ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ , బిజెపి లకు దీటుగా బర్రెలక్క (Barrelakka Alias Sirisha ) తన మేనిఫెస్టో ను రిలీజ్ చేసి మరింతగా ఆకట్టుకుంది. బర్రెలక్క ఈ పేరు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా బర్రెలక్క (Barrelakka ) మారింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల దంగల్ లో బరిలోకి దిగింది.

We’re now on WhatsApp. Click to Join.

నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ (Kolhapur )నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బర్రెలక్క(శిరీష) పోటీ చేస్తుంది. తన విజిల్ గుర్తుకు ఓటువేయాలంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ హైలైట్ అవుతుంది. ఈమె ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ ఆమెకు సపోర్ట్ పలుకుతున్నారు. సోష‌ల్ మీడియాలో శిరీష‌కు అనుకూలంగా.. పాట‌లు, నినాదాలు.. పోటెత్తుతున్నాయి. స్వ‌చ్ఛంద సంస్థ‌లు బ్యాన‌ర్లు, ఎన్నిక‌ల సామాగ్రిని ఆమెకు అందిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం అంటేనే డబ్బు తో కూడుకున్నది. ప్రతిదీ ఖర్చు చేస్తూ పోవాల్సిందే. కానీ శిరీష్ ప్రచారంలో అన్ని ఖర్చులు వేరే వారే చూసుకుంటున్నారు.

ఇక తాజాగా ఈమె తన మేనిఫెస్టో ను విడుదల చేసింది. అవి ఏంటో చూస్తే..

1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా
2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా
3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్
7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్.

Read Also : Hyderabad: మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు: వెదర్ రిపోర్ట్