Site icon HashtagU Telugu

Barrelakka: ఎన్నికల బరిలో దూసుకుపోతున్న బర్రెలక్క.. ప్రత్యర్థి పార్టీలకు బిగ్ ఝలక్!

Barrelakka Manifesto

Barrelakka Manifesto

Barrelakka: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారింది. ఏమాత్రం అంచనాలు లేకుండా నామినేషన్ వేసిన ప్రస్తుతం ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కొల్లాపూర్ సెగ్మెంట్‌లో నామినేషన్ వేసిన శిరీషకు మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  బర్రెలక్కగా గుర్తింపు పొంది కర్నె శిరీష్ (26) ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది.  దీంతో మిగతా అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల్లో పోటీచేస్తున్న బర్రెలక్కకు బెదిరింపులు మొదలయ్యాయి. ప్రచారంలో ఆమెపై, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. పోటీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి.

అయితే, ఈ ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా సరే పోరాటం ఆపబోనని స్పష్టం చేసింది. బర్రెలక్కపై దాడి జరగడంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తనలాంటి నిరుద్యోగుల కోసం అండగా నిలబడుతానని తేల్చి చెప్పింది. బర్రెలక్కా సాహసం ప్రతిఒక్కరినీ కదిలించింది. తెలంగాణలోని విద్యావంతులు, టీచర్లు, యూత్ సంఘాలు ఆమె విజయానికి కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఉట్టి చేతులతో వెళ్లకుండా ఆమెకు ఎంతో కొంత ధనసాయం చేసి ప్రచారం లో చేతులు కలుపుతున్నారు. కొంతమంది నేరుగా ప్రచారానికి వస్తుండగా ఇంకొంత మంది తమకు తోచిన నగదు సాయం చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆమెకు మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అయితే బర్రెలక్కకు ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో ప్రధాన పార్టీలకు మింగుడు పడటం లేదు. బర్రెలక్క బరిలో దిగడంతో తమ ఓటమిపై ప్రభావం చూపుతుందని మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బర్రెలక్క విజయం సాధించినా, ప్రత్యర్థి పార్టీలకు సమీప మెజార్టీ సాధించినా సంచలనమే అవుతుందని చెప్పక తప్పదు.

Also Read: MLC Kavitha: ఎంఐఎం పార్టీతో మాది పదేళ్ల స్నేహ బంధం: ఎమ్మెల్సీ కవిత