Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క

పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది

Barrelakka Crying: సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ అనేక మంది యువత పాపులారిటీ సంపాదిస్తున్నారు. సరదాగా చేసిన రీల్స్ ద్వారా బర్రెలక్క (శిరీష) ఫేమస్ అయింది. ఎన్ని చదువులు చదివినా గవర్నమెంట్ జాబ్స్ రావు బర్రెలు కాయడమే అంటూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సెకన్ల వ్యవధిలోనే వైరల్ కావడంతో బర్రెలక్క ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. అలాగే బర్రెలక్క (శిరీష) గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. దీంతో ఆమెకు మరింత ప్రజాదరణ లభించింది.కానీ విజయం సాధించలేకపోయింది. ఇటీవల బర్రెలక్క పెళ్లి చేసుకుంది.

రేపు తెలంగాణలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్ కూడా వేశారు. అయితే తాజాగా పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మీ ట్రోల్స్ ద్వారా ఈ రోజు నా కుటుంబం బాధపడుతుందని చెప్తూ బోరున ఏడ్చింది. మీ ట్రోల్‌ల వల్ల నా కుటుంబ సభ్యులు మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. నెగిటివ్ ట్రోల్స్ పంపుతూ వేధిస్తున్నారు. ఇలా ట్రోల్స్‌ చేయడం మీకు వినోదం కావచ్చు. కానీ బాధిత కుటుంబానికి అది తీరని ఆవేదని అంటూ ఆమె పేర్కొన్నారు.

ఇలా చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. అందులో నాది ఒకటి. నేనేం తప్పు చేశానో అర్థం కావడం లేదు. అయితే ఈ ట్రోల్స్ వల్ల నేనూ, నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాం. నన్ను నెగెటివ్‌గా ట్రోల్ చేసే వారిపై ఫిర్యాదు చేస్తాను అలాంటి వారిని వదిలిపెట్టను. ఎంపీ ఎన్నికల నిర్వహణ కోసం కూడా నన్ను ఎంత దారుణంగా వేధిస్తున్నారు. కామెంట్స్‌తో వాళ్ళు చాలా బాధ పడుతున్నారు. నేను చాలా విసుగు చెందాను. ఒక్కోసారి చచ్చిపోతానేమో అనిపిస్తుంది, ఏదైనా చేయాలంటే భయంగా ఉంటుంది. ఇప్పుడే జీవితాన్ని ప్రారంభించాను అని ఆమె చెప్పింది.

ఎన్నికల తర్వాత ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ కి నేను దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. గత వీడియోలు అన్ని తొలగించి నా భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను ట్రోల్ చేయకండి. తదుపరి రాజకీయ జీవితాన్ని కూడా ముగించుకుంటున్నాను. నాకర్థమైంది ఏంటంటే.. ఇక్కడకు వచ్చిన వారికి మంచి చేయడానికి చోటు ఉండదు. అందుకే నేను నా జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను, ధన్యవాదాలు అని బర్రెలక్క చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అలాగే కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

Also Read: Free Electricity : ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ 10 సంచలన హామీలు