Site icon HashtagU Telugu

Barrelakka: రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు

Pawan Kalyan Barrelakka

Pawan Kalyan Barrelakka

Barrelakka: సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క శుక్రవారం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో జరిగిన ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో RGV బరలక్కను పవన్ కళ్యాణ్‌తో పోల్చారు. పేరు లేదా ఊరు లేకపోయినప్పటికీ ఆమె ప్రజాదరణ పొందిందని, అయితే సూపర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని కామెంట్ చేశాడు. ఆర్జీవీ వ్యాఖ్యలతో కంగుతిన్న ఆమె తన న్యాయవాది రాజేష్ కుమార్‌తో కలిసి అతనిపై ఫిర్యాదు చేసింది. కర్నె శిరీష అని పిలువబడే బర్రెలక్క తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసి ఇటీవల వెలుగులోకి వచ్చారు.

వర్మ కామెంట్స్ తనను అవమానపరిచేలా ఉన్నాయని.. నాపై వర్మ అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను విడుదల చేస్తున్నారు. నిజానికి అది ఏపీ రాజకీయాలకు సంబంధించిన మూవీ. టీడీపీని బ్యాడ్ గా చూపిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గొప్పగా చూపించేలా ఈ సినిమాను తీశాడు ఆర్జీవీ. కావాలనే జగన్ ఈ సినిమాను ఆర్జీవీతో తీయించాడని విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీని బ్యాడ్ చేయడం కోసమే ఆర్జీవీతో కలిసి జగన్ ఆడుతున్న నాటకం అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ సినిమాపై కూడా ఏపీలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.

Also Read: Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, తొలిరోజు 7,46,414 దరఖాస్తులు