Site icon HashtagU Telugu

Barrelakka Manifesto: బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టో..

Barrelakka Manifesto

Barrelakka Manifesto

Barrelakka Manifesto: తెలంగాణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణలో ప్రధానం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ రాజకీయాలను హీట్ పుట్టిస్తుంది.

యూట్యూబర్ గా మొదలైన ఆమె ప్రస్థానం ఎమ్మెల్యే అభ్యర్థి వరకు సాగింది. పైగా అధికార పార్టీ నేతలు ఆమెను భయాందోళనకు గురి చేసినా బెదరకుండా ముందుకెళ్తుంది. ఇక ఎంతోమంది ఆమెకు మద్దతుగా నిలుస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానూ ఆమె జనాల్లోకి వెళ్తున్నారు.కొల్లాపూర్‌లో ఇప్పుడామె పేరు మార్మోగిపోతోంది. పైగా ఆమె మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసింది. బర్రెలక్క దృఢసంకల్పానికి ప్రత్యర్థి నేతలు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆమె ప్రకటించిన హామీలను ఒకసారి చూద్దాం.

బర్రెలక్క మేనిఫెస్టో
1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా.
2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా
3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు
7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్

Also Read: Animal Trailer : యానిమల్ ట్రైలర్.. ఇది సందీప్ మార్క్ విధ్వంసం..!