తెలంగాణ సీఎం (Telangana CM) గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. హైదరాబాద్ LB స్టేడియం లో జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు , ప్రజలు హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటె గత కొద్దీ రోజులుగా నిర్మాత బండ్ల గణేష్ పేరు మారుమోగిపోతుంది. రెండు నెలలకు ముందే గణేష్..తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని , రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని చెప్పుకొస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే జరగడం తో కాంగ్రెస్ శ్రేణులతో పాటు రేవంత్ అభిమానులు బండ్ల గణేష్ (Bandla Ganesh) ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో నేడు ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలను గణేష్ పరివేక్షించాడు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ..”పోరాడేవారికే కత్తి ఇస్తారు.. కత్తి ఇచ్చేవారికే కిరీటం కూడా ఇస్తారు. దీనిలో పెద్ద లాజిక్కేం లేదు. రేవంత్ రెడ్డి పడిన కష్టం.. మాటతీరు.. జనంలోకి చొచ్చుకెళ్లిన విధానం చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం.. వచ్చింది. కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. రేవంత్ నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది” అంటూ రేవంత్ ఫై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు. ఇలా రేవంత్ ఫై తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ వస్తుండడం తో చాలామంది త్వరలోనే గణేష్..రేవంత్ రెడ్డి ఫై ఓ సినిమా చేస్తాడు కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతే కాదు గణేష్ అయితేనే రేవంత్ బయోపిక్ కు న్యాయం చేస్తాడని చెప్పుకొస్తున్నారు. మరి నిజంగా గణేష్ రేవంత్ ఫై సినిమా చేస్తాడా..? అనేది చూడాలి.
Read Also : Revanth Invites KCR: రేపే రేవంత్ ప్రమాణ స్వీకారం.. మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానాలు..!