Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్

  • Written By:
  • Updated On - February 27, 2024 / 02:22 PM IST

వైసీపీ మంత్రి రోజా ఫై మరోసారి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా.. ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీతో పాటు పలు సందర్భాల్లో రిపీట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలకు చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న మంత్రి రోజా తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఎప్పుడు ఎవరి కోసం చేపల పులుసు చేయలేదని చెప్పుకొచ్చారు. జాక్ పాట్‌లో సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. అందుకే ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని రోజా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కాదని, కోవర్టు రెడ్డని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ నేతలను కలవడంలోనే రేవంత్ కోవర్టని తెలుస్తోందన్నారు. 28 వంటకాలతో కేసీఆర్‌కు చంద్రబాబు డిన్నర్ ఇవ్వడం మరచిపోయారా అంటూ ప్రశ్నించారు రోజా.

We’re now on WhatsApp. Click to Join.

రోజా వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. రోజా కాదు ఆమె డైమండ్ రాణి..ఆమెకు ఈసారి సీటు వస్తుందో రాదో..రేవంత్ రెడ్డి యాక్స్డెంటల్ సీఎం కాదు..జగన్ యాక్స్డెంటల్ సీఎం ..రేవంత్ పోరాట యూదుడు .ఫైటర్ అంటూ గణేష్ ప్రశంసలు కురిపించారు.భారతదేశంలో రేవంత్ లాంటి యూదుడు చాల తక్కువ మంది ఉంటారు..ఆ తక్కువ మందిలో ఒక్కరు రేవంత్.పోరాడి , కష్టపడి తానేంటో రుజువు చేసుకొని సీఎం అయ్యారు. నాన్న చనిపోతేనే ..నాన్న వారసత్వంగానో సీఎం కాలేదు. పులుసు వండిపెట్టింది కాబట్టే రోజా పులుసు పాప అయ్యిందంటూ గణేష్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. రేపోమాపో మాజీ అయ్యాక..జబర్డస్త్ ప్రొగ్రమ్స్ చేసుకోవాలని గణేష్ సూచించారు.

అంతే కాదు కేటీఆర్ ఫై కూడా గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకోనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. కేసీఆర్ అబ్బాయిగా తప్ప కేటీఆర్ కి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని.. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నారని బండ్ల గణేష్ అన్నారు. కేటీఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్ అని విమర్శించారు. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని తిట్టిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని తెలిపారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవని అన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ వెళ్ళారని గణేష్ ఆరోపించారు.

Read Also : Stomach Flu Cases: పెరుగుతున్న స్టొమక్ ఫ్లూ కేసులు..? ఈ వ్యాధి ల‌క్ష‌ణాలివే..!