Bandla Ganesh : రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఎవరూ మాట్లాడొద్దని బండ్ల గణేష్ రిక్వెస్ట్

'దయచేసి అందరూ నాయకులకి చేతులెత్తి నమస్కరిస్తూ చెబుతున్నా. అధిష్టానం, అందరు పెద్దలు కలిపి నిర్ణయాలు తీసుకొని టికెట్లు కేటాయిస్తారు. దయచేసి రేవంత్ రెడ్డి గారిని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడకండి

Published By: HashtagU Telugu Desk
Bandla Ganesh

Bandla Ganesh

తెలంగాణ ఎన్నికల సమయం (Telangana Election Time) దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల్లో టిక్కెట్ల లొల్లి నడుస్తుంది. టికెట్స్ దక్కని నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్తూ..సొంత పార్టీ ఫై , పలువురు నేతలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తో పాటు కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కూడా ఇలాగే వార్ నడుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 55 మంది (Congress Party 55 Candidates List)తో కూడిన అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. మరో విడతలో మిగతా అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ లోపే కొంతమంది తమ పేర్లు రాలేదని చెప్పి పార్టీ ఫై , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఫై ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) టికెట్స్ అమ్ముకుంటున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆరోపణల ఫై నిర్మాత , కాంగ్రెస్ కార్యకర్త బండ్ల గణేష్ (Bandla Ganesh) స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి ఎవరూ మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ (Bandla Ganesh Tweet) చేశారు. ‘దయచేసి అందరూ నాయకులకి చేతులెత్తి నమస్కరిస్తూ చెబుతున్నా. అధిష్టానం, అందరు పెద్దలు కలిపి నిర్ణయాలు తీసుకొని టికెట్లు కేటాయిస్తారు. దయచేసి రేవంత్ రెడ్డి గారిని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడకండి. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి.. గెలిచి తీరాలన్న సంకల్పంతో అందరూ ముందుకెళ్లండి. అధికారంలోకి వస్తే ఎన్నో పదవులు.. ఎన్నో అవకాశాలు.. ఎంతో సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటె కొద్దీ రోజుల క్రితం బండ్ల గణేష్ కాంగ్రెస్ బరిలో నిలుస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున కావడం తో వాటిపై గణేష్ స్పందించారు. ‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అదికారంలోకి వస్తాం జై కాంగ్రెస్’ అంటూ గణేష్ క్లారిటీ ఇచ్చారు.

Read Also : Janareddy : సీఎం అయితానేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన జానారెడ్డి

  Last Updated: 17 Oct 2023, 10:23 PM IST