Site icon HashtagU Telugu

Bandla Ganesh : ఈరోజు రాత్రి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా – బండ్ల గణేష్

Bandla Ganesh Over Cm Oath

Bandla Ganesh Over Cm Oath

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం..సీఎం గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేస్తుండడం తో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వీరిలో బండ్ల గణేష్ కూడా ఉన్నారు. మొదటి నుండి కూడా తెలంగాణాలో ఈసారి కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని , రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని బలంగా చెపుతూ వచ్చారు. అంతే కాదు డిసెంబర్ 09 న LB స్టేడియం (LB Stadium) లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని..నేను రెండు రోజుల ముందు నుండే LB స్టేడియం లో ఉంటానని తెలిపి వార్తల్లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన బండ్ల గణేష్ మాట్లాడుతూ.. మూడు రోజుల ముందుగానే సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తాను ఈరోజు రాత్రి నుంచి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానన్నారు. 200 పర్సెంట్ ఈ రాత్రికి తాను స్టేడియంలోనే ఉంటానన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ చాలా కష్టపడ్డారన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు. కేవలం పార్టీ కోసం పని చేశానని చెప్పుకొచ్చారు.

Read Also : Jagan Video Conference : తుపాన్ ప్ర‌భావిత జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో జగన్ వీడియో కాన్ఫ‌రెన్స్‌