Site icon HashtagU Telugu

MLC : ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్..?

Bandla Ganesh

Bandla Ganesh

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)..ఎమ్మెల్సీ (MLC) రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రసీమలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న గణేష్..ఆ తర్వాత నిర్మాత గా మారి, అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్న ఆయన..అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ మధ్య వార్తలు వినిపించినప్పటికీ..వాటిని ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్ ఉన్నట్లు బాగా ప్రచారం జరుగుతుంది. గవర్నర్ కోటాలో ఇచ్చే రెండు ఎమ్మెల్సీలు చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. కళలు, సాహిత్యం, సైన్స్, సంఘ సంస్కరణ ఇలా ఐదు రంగాల్లో విశిష్ట సేవ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి ఇస్తారు.

కళాకారులు, రచయితలు, సంఘసంస్కర్తలు, మేధావులని గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తుంది. గతంలో కెసిఆర్ సర్కార్ పొలిటికల్ లీడర్స్‌ని ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయడానికి ట్రై చేసినప్పటికీ..గవర్నర్ తమిళసై ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అప్పటినుంచి ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని భర్తీ చేసే ఆలోచనలో ఉంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు గణేష్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావన కూడా తెచ్చినట్లు సమాచారం. సీఎం సైతం సానుకూలంగా స్పందించినట్లు వినికిడి. త్వరలోనే దీనిపై ఓ ప్రకతాం రానుందని అంటున్నారు.

Read Also : Water Supply: జనవరి 3న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్