Bandla Ganesh : ఏ క్షణం ఏం జరుగుతుందో..ప్రతి కార్యకర్త కాపలా కాయండి – బండ్ల గణేష్

కాంగ్రెస్ అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఈ రాత్రికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కాపలా ఉండండి

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 11:08 PM IST

మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మొదలుకాబోతుంది..ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్ల బాక్స్ లు.. ఆర్డీవో ఆఫీస్ లోనే ఉండడం..అవి కూడా సీల్ లేకుండా ఉండడం తో అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అనేక భయాలు , అనుమానాలను రెట్టింపు చేస్తుంది.

కాంగ్రెస్ అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఈ రాత్రికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కాపలా ఉండండి. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది, ఎవరిని నమ్మొద్దు ఇది నా విజ్ఞప్తి విన్నపం అంటూ గణేష్ ట్వీట్ చేసాడు. గత కొద్దీ రోజులుగా బండ్ల గణేష్ పేరు రాజకీయాల్లో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా గణేష్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు పలుకుతూ వచ్చారు. రేవంత్ సీఎం అవుతాడు.. నేను 7 రాత్రికే ఎల్బీ స్టేడియానికి వెళ్లి పడుకుంటానంటూ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచాడు. అప్పటి నుండి ఏదోక వార్త తో మీడియా లో హైలైట్ అవుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో ట్వీట్ తో మళ్లీ వార్తల్లో నిలిచాడు.

అసలు ఏంజరిగిందంటే..

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎవరు విజయం సాధిస్తారో రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. ఓ పక్క ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతుంటే..బిఆర్ఎస్ నేతలు మాత్రం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం..సంబరాలకు సిద్ధం కండి అని భరోసా ఇస్తున్నారు. ఇలా ఇరు పార్టీల ధీమాల తో రాష్ట్ర ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా తెలుగు ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. అసలు రేపు ఏంజరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొని ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్ ను తొలగించి ఉంచడం ఫై అనేక అనుమానాలు వస్తున్నాయి.

నవంబర్ 29 న పోస్టల్ బ్యాలెట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్ లో భద్రపరిచారు. కానీ ఆ తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించకుండా ఉంచిన విషయాన్నీ తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు..శనివారం పెద్ద ఎత్తున ఆర్డీవో ఆఫీస్ ను చుట్టుముట్టారు. ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు తరలించలేదని అధికారులను ప్రశ్నించారు. ఇదే క్రమంలో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లు బాక్స్ లకు సీల్ లేకుండా ఉండడం..అందులో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు లేకపోవడం తో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏదో పెద్ద కుట్ర జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్‌ వేశారు. పోలింగ్‌ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also : Ibrahimpatnam RDO Office : ఇబ్రహీంపట్నం లో ఉద్రిక్తత..పోస్టల్‌ బ్యాలెట్‌ రూమ్ సీల్ ఓపెన్