Bandla Ganesh : మల్లారెడ్డి..విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నాడు – బండ్ల గణేష్

సినీ నటుడు , కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ..మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. మల్లారెడ్డి..విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నాడని గణేష్ ఆరోపించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్న గణేష్..ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యాడు. We’re now on WhatsApp. Click to Join. మల్కాజ్‌గిరి లోక్‌స‌భ‌ నియోజకవర్గం (Malkajgiri MP) […]

Published By: HashtagU Telugu Desk
Ganesh Mallareddy

Ganesh Mallareddy

సినీ నటుడు , కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ..మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. మల్లారెడ్డి..విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నాడని గణేష్ ఆరోపించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్న గణేష్..ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

మల్కాజ్‌గిరి లోక్‌స‌భ‌ నియోజకవర్గం (Malkajgiri MP) నుంచి పోటీ చేసేందుకు బండ్ల గణేష్ (Bandla Ganesh) నేడు గాంధీభవన్ లో దరఖాస్తు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘డబ్బు ఉందనే అహంకారంతో మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనే పదానికి గౌరవం ఇవ్వాలి. సీఎంను ఏకవచనంతో సంబోధిస్తున్నారు.. ఇది పద్ధతి కాదు.ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు.. సీఎం రేవంత్ రెడ్డిని టచ్ కూడా చేయలేరు. రోజుకు 20 గంటలు పనిచేస్తున్న ఏకైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం.. అర్ధ రహిత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన అద్బుతంగా ఉంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుంది’ అని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి మతిభ్రమించి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇక పార్లమెంట్‌ బరిలో నిలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీని కోసం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆశావహులు భారీగా దరఖాస్తులు సమర్సిస్తున్నారు. ముఖ్యంగా మినీ ఇండియా గా పేరు ఉన్న మల్కాజ్‌గిరి లోక్‌స‌భ‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు సమర్పించినట్టు తెలుస్తోంది. మరి అధిష్టానం ఫైనల్ గా ఎవరికీ టికెట్ ఇస్తుందో చూడాలి.

Read Also : Door To Door Survey : అభయహస్తం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే.. ఇవి రెడీ చేసుకోండి

  Last Updated: 02 Feb 2024, 02:35 PM IST