Site icon HashtagU Telugu

Bandla Ganesh : కేటీఆర్ కు భయం పట్టుకుంది – బండ్ల గణేష్

Bandla Ganesh

Bandla Ganesh

చిత్ర నిర్మాత , కాంగ్రెస్ పార్టీ అభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)..మరోసారి మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం తో కేటీఆర్ లో భయం మొదలైందన్నారు. ప్రజల సమస్యలను చెప్పేందుకు ముఖ్యమంత్రిని కలవొద్దా. వారిని భయపెట్టి ప్రెస్ మీట్ పెట్టించారు. కాంగ్రెస్ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. ఇంకో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే ఉంటుంది. మీరు CM కావాలనుకుంటే వేరే రాష్ట్రాల్లో పోటీ చేయండి’ అని గణేష్ విరుచుకుపడ్డారు.

ప్రభుత్వాన్ని కూలగొడతామని పదే పదే మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో సీఎం పోస్టు ఖాళీగా లేదని, అవసరం అయితే ఏపీ, మహారాష్ట్రంలో కేసీఆర్ ను సీఎంగా చేసుకోవాలని చురకలంటించారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే హామీల గురించి అడగటం ఏంటని ప్రశ్నించారు. ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని బండ్ల గణేష్ అన్నారు. కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ పై గౌరవం ఉందని గణేష్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం కేటీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే కేటీఆర్ కు మైండ్ బ్లాక్ అయిందని ..నిన్న కరీంనగర్ లో కేటీఆర్ మా ఎమ్మెల్యే లపై అసహనంతో మాట్లాడాడని అన్నారు. బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే చులకన అంటూ మండిపడ్డారు. మీ దొరలే ఎమ్మెల్యేలుగా ఉండాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భరతం పడుతాను అంటే అర్థం ఎంటి..? అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ దళిత, బీసీల వ్యతిరేకి అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు దోరాహంకారం ఇంకా పోలేదని అన్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మాట్లాడిన మాటలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు.

Read Also : Haridwar : గంగ నదిలో ముంచితే బ్లడ్ క్యాన్సర్‌ తగ్గుతుందనే మూఢనమ్మకంతో పిల్లాడ్ని చంపేశారు