సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల వరుస కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఎక్కువగా సినిమాలకు సంబదించిన విషయాలు..హీరోలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో హైలైట్ అయ్యేవారు..కానీ ఇటీవల పూర్తిగా పొలిటిషన్ గా మారారు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఎంత అభిమానమో..రేవంత్ రెడ్డి అంటే ఎంత పిచ్చో ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది. నిన్న రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులు పూర్తయిన సందర్భాంగా ప్రసంశలు కురిపించి వార్తల్లో నిలువగా..ఈరోజు కేటీఆర్ , హరీష్ రావు లపై కామెంట్స్ చేసి హైలైట్ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల పూర్తైన నేపథ్యంలో పాలనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా పాలన జరుగుతోందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు ప్రజాపథం వైపునకు దూసుకుపోతున్నారని కితాబిచ్చారు. ఇదే తరుణంలో కొంతమంది బిఆర్ఎస్ శ్రేణులు గణేష్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. దీంతో గణేష్ ఫైర్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం ఆయన హైదరాబాద్, గాందీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉందని కొనియాడారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నిన్న (ఆదివారం) మీడియా సమావేశంలో దారుణంగా మాట్లాడారన్నారు. అసూయ, ద్వేషంతో మాట్లాడారని, ఒక రోజు హరీష్ రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత మాట్లాడతారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ప్రగతిపథంలో దూసుకుపోతున్నారని అన్నారు.
100 రోజుల తర్వాత పప్పులు ఉడకడం కాదు బిర్యానీ కూడా ఉడుకుతుందని.. హరీష్ రావు అంటూ సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని అంటూ నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్రంతో కొట్లాడారా? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. పాలనలో పారదర్శకత కోసం అవినీతి అధికారులను పక్కకు తప్పిస్తున్నారని తెలిపారు. నిజాయితీ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించి పరిపాలన చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ను ప్రశంసించారు. ఇదే సందర్బంగా పార్లమెంటు ఎన్నికలపై బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదని స్పష్టం చేశారు.
Bandla Ganesh: నేను ముఖ్యమంత్రిని అని విర్రవీగావ్.. ఇప్పుడు నీ పరిస్థితి..? || KCR || ABN Telugu#bandlaganesh #bandlaganeshpressmeet #congress #abntelugulive #abntelugu pic.twitter.com/5TQBozh45e
— ABN Telugu (@abntelugutv) January 8, 2024
Kurchi Thatha : ఆఖరికి ‘కుర్చీ తాత’ను భిక్షాటన చేసుకునేలా చేసారా..?
Read Also :