Site icon HashtagU Telugu

CBN’s Gratitude Concert : చంద్రబాబు గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న బండ్ల గణేష్..

Ganesh Speech

Ganesh Speech

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration )లు ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) ఇటీవలే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్బంగా నేడు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకను జరిపారు.

ఈ కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. అలాగే నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna), బాలకృష్ణ భార్య వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామ కృష్టమ రాజు (Raghuramakrishnam Raju), ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్, ఏబీ వెంకటేశ్వరరావు, బండ్ల గణేష్‌ (Bandla Ganesh), బీఆర్ఎస్ పార్టీ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బోయపాటి శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ (Bandla Ganesh) మాట్లాడుతూ ఎమోషనలకు గురయ్యారు. కొద్దిసేపటి వరకు స్టేజీపై అలానే ఏడుస్తూ ఉండిపోయారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో నేను వినాయకచవితి పండుగ చేసుకోలేదు, దసరా పండుగ చేసుకోలేదు…. దీపావళి పండుగని ఘనంగా జరుపుకునేలా చంద్రబాబుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. చంద్రబాబు కోసం మా ప్రాణాలు ఇస్తాం. సైబరాబాద్ లాగా… ఏపీలోని అమరావతి, గుంటూరు, రాజమండ్రిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు అనుకున్నారు’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

చంద్రబాబు… అది పేరు కాదు బ్రాండ్. బ్రాండ్ కూడా కాదు, మనిషి కూడా కాదు… దేవుడు. ఆయన దేవుడు అని ఎందుకు చెబుతున్నానంటే… మా సొంతూరు ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర్లోని ఓ ఊరు. నాకు ఎనిమిది నెలల వయసున్నప్పుడు మేం అక్కడ్నించి బతకడానికి ఎక్కడికో వలస వచ్చాం. అప్పుడప్పుడు మా ఊరికి వెళ్లొస్తుండేవాడ్ని. మా బంధువులందరూ పాడి పశువులతో ఉపాధి పొందుతూ, గుంటూరు, పొన్నూరులో ఉంటూ పిల్లలను ట్యూషన్ చేర్పించి చదువు చెప్పించేవాళ్లు.

కొన్నాళ్ల తర్వాత చూస్తే… మా ఊరి నుంచి పొన్నూరుకు కాలినడకన, ఆటోల్లో వచ్చే మా పిన్ని వాళ్లు విమానాలెక్కి అమెరికా వెళుతున్నారు. ఏం పిన్ని ఎక్కడికి వెళుతున్నావు అంటే… అమ్మాయి సాఫ్ట్ వేర్ కదరా, అల్లుడు సాఫ్ట్ వేర్ కదరా… అమెరికా వెళుతున్నాను అని చెబుతుంటే కడుపు నిండిపోయినట్టయ్యేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటూ… ఈరోజు మనవాళ్లు దేశవిదేశాల్లో ఐటీ ఉద్యోగాలతో బతుకుతున్నారంటూ దాని వెనుక చంద్రబాబు కృషి ఉంది. మా నాన్న వయసు 78 ఏళ్లు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశార్రా అని ఆయన అడిగారు. నాన్నా… కులీకుతుబ్ షా హైదరాబాద్ ను కట్టాడు… 400 ఏళ్లయినా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. అలాగే సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబును 4 వేల ఏళ్లయినా గుర్తుంచుకుంటారు అని చెప్పాను. శ్రీకృష్ణుడు అంతటివాడికి కూడా జైలే జన్మస్థానం అయింది… శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా!… అరణ్యవాసం వెళ్లిన రాముడు దేవుడు కాకుండా పోయాడా!… 40 రోజులుగా జైల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు దేవుడు కాకుండా పోతాడా నాన్నా అని అన్నాను. ఇలా చంద్రబాబు గురించి గణేష్ చెపుతూ ఉంటె కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆలా వింటూ వచ్చారు. ఇప్పటి వరకు గణేష్ పవన్ కళ్యాణ్ గురించే ఈ రేంజ్ లో స్పీచ్ ఇస్తూ వచ్చారు. కానీ మొదటిసారి చంద్రబాబు గురించి మాట్లాడేసరికి అంత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో గణేష్ స్పీచ్ వైరల్ అవుతుంది.

 Read Also : Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం