Bandla Ganesh : అప్పుడు బ్లేడ్ తో..ఇప్పుడు LB స్టేడియంతో ట్రోల్స్ ఫై బండ్ల గణేష్ రియాక్షన్ ..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ తో కోసుకుంటా అని ప్రకటించి సంచలనం రేపాడు

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 11:29 AM IST

బండ్ల గణేష్..పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన గణేష్ (Bandla Ganesh)..అతి కొద్దీ కాలంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. కేవలం చిత్ర సీమలోనే కాదు రాజకీయాల్లోనూ ఆయన పేరు బాగా వినిపిస్తుంటుంది. ముఖ్యంగా తనమనసులో ఏముంటే అది..బయటకు చెపుతుంటాడు. అవతలి వ్యక్తి ఎంత పెద్ద వారైనా..ఏ సభ ఐన సరే..ఏమాత్రం ఆలోచించకుండా బయటకు చెప్పేస్తాడు. అందుకే ఆయన పేరు నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ (7 o’clock Blade) తో కోసుకుంటా అని ప్రకటించి సంచలనం రేపాడు. అయితే బండ్ల గణేష్ చెప్పిన మాటలు నిజం కాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు.. గణేష్ పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన..రీసెంట్ గా ఎన్నికల సమయం నుండి మళ్లీ రాజకీయంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ తో గెలవబోతుందని , సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకొచ్చాడు. అంతే కాదు డిసెంబర్ 7 న LB స్టేడియంకు దుప్పటి తీసుకెళ్లి.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేవరకు ఎదురుచూస్తాను అని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో..తనపై వస్తున్న ట్రోల్స్ ఫై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘కాంగ్రెస్ అధికారంలోకి రావడం నాకు చాలా హ్యాపీ గా ఉంది. ప్రమాణ స్వీకారానికి ముందు స్టేడియంలో వెళ్లి పడుకుంటా అని చెప్పాను. కానీ, దేవుడు.. ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా ముందుకు జరిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు, ప్రకృతి, భగవంతుడు కూడా త్వరగా ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయమని సూచిస్తున్నారు. ఇది ప్రజల విజయం.. తెలంగాణనే బంగారం.. ఈ బంగారు పాలన రేపటి నుంచి జరగబోతుంది’ అని తెలిపారు.

2018 లో పోటీచేయాలనుకున్నారు.. సీటు ఇవ్వలేదని రాజకీయాల నుంచి వైదొలిగారు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎప్పడు చేరారు అన్న ప్రశ్నకు గణేష్ మాట్లాడుతూ.. ‘ నేను ప్రస్తుతానికి వైదొలుగుతానని చెప్పాను.. ఎందుకంటే.. నా సమస్యలు.. నా ఒత్తిళ్లు.. టీఆర్ ఎస్ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక వైదొలుగుతాను అన్నాను కానీ, నేను పుట్టినప్పటినుంచి కాంగ్రెస్.. ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటాను. సీటు ఇచ్చిన వెళ్లకపోవడానికి కారణం.. నా సమస్యలు నాకున్నాయి. ఊరికే పెద్దోళ్లు దళితులను సీఎం చేస్తాం.. అది చేస్తాం అన్నవాళ్లను వదిలేసి.. బ్లేడ్ అన్నందుకు ఐదేళ్లు ట్రోల్ చేశారు.. ఇప్పుడు నేను కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఎవరు ఏం అనరే.. అప్రిషియేట్ చేయరే.. డిసెంబర్ 7 న ప్రమాణ స్వీకారం అన్నాను.. ఇది ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read Also : Palakurthi : 40 ఏళ్ల పొలిటికల్ నేతను ఓడించిన యువ కెరటం..