Site icon HashtagU Telugu

Revanth Reddy Biopic : రేవంత్ బయోపిక్ ను ప్రకటించిన బండ్ల గణేష్

Revanth Biopic

Revanth Biopic

అంత భావించినట్లే నిర్మాత బండ్ల గణేష్..రేవంత్ రెడ్డి (Revanth Reddy) బయోపిక్ (Biopic) ను తీయబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కి వీరాభిమాని గణేష్.. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడం..రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుండడం తో గణేష్ ఆనందానికి అవధులు లేవు. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదిగిన తీరు ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదనడంలో సందేహం లేదు. అలాంటి వ్యక్తి స్టోరీని బయోపిక్ గా తీయాలని అనుకుంటున్నట్లు బండ్ల గణేష్ చెప్పడం కాంగ్రెస్ శ్రేణుల్లో , అభిమానుల్లో సంతోషం నింపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. రేవంత్‌రెడ్డికి ఎంతో మంది విలన్‌లు ఉన్నారని, ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గుర్తుచేసుకున్నారు. అలాగే ఇబ్బందులు పడిన చోటే నాయకుడిగా ఆయన అధికారం చేపడుతున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. రేవంత్ కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసన్నారు. ఇదిలా ఉంటె రెండు నెలలకు ముందే గణేష్..తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని , రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని చెప్పుకొస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే జరగడం తో కాంగ్రెస్ శ్రేణులతో పాటు రేవంత్ అభిమానులు బండ్ల గణేష్ (Bandla Ganesh) ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత రేవంత్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. ఇన్నాళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా మాత్రమే చర్చల్లో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు .. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపుతో వీరుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు.

Read Also : Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు