Telangan BJP: బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్

రాష్ట్ర బీజేపీ లో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరుగుతుంది. ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలే దీనికి సాక్ష్యం.

  • Written By:
  • Updated On - November 27, 2021 / 12:25 PM IST

రాష్ట్ర బీజేపీ లో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరుగుతుంది. ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలే దీనికి సాక్ష్యం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈటెల రాజేందర్ మాత్రం ఆదిలాబాద్ స్వతంత్ర అభ్యర్థి విషయంలో మాట్లాడుతూ ఆ అభ్యర్థిని తానే పోటీకి పెట్టానని తెలిపారు. దీన్నిబట్టి రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కోతీరులాగా కన్పిస్తోంది.

హుజురాబాద్ లో ఈటెల గెలిచిన తరువాత తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేదని పలువురు నేతలు మాట్లాడుతున్నారు. దీనితో పార్టీలో ఈటెల ఫోకస్ కావొద్దని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈటల విషయంలో ఇప్పటికీ తాను బీజేపీ నాయకుడిగా కంటే కూడా తెలంగాణ నాయకుడిగానే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.
హుజురాబాద్ గెలుపును కూడా అది కేవలం ఈటెల గెలుపు అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అది బీజేపీ గెలుపని ప్రచారం చేయాలని అగ్ర నాయకత్వం కింది స్థాయి నాయకులకు పిలుపునిచ్చారని టాక్.

బీజేపీలో కూడా ఇలాంటి టెండెన్సీ ఎక్కువైతే పార్టీలో చీలికలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.