Site icon HashtagU Telugu

Bandi Sanjay : సంక్రాతికి పేద ప్ర‌జ‌ల‌కు బియ్యం పంపిణీ చేయాలి – బండి సంజ‌య్‌

Telangana BJP

Sanjay bandi

సంక్రాంతి సందర్భంగా పేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బియ్యం సరఫరా చేయాలని తెలంగాన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ మేర‌కు ఆయ‌న సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నెలకు (జ‌న‌వ‌రి) సంబంధించి ఇప్పటివరకు పిడిఎస్ బియ్యం సరఫరా లేకపోవడం వల్ల తెలంగాణలోని 3.5 కోట్ల మందికి పైగా ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆకలితో అలమటించవలసి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏడాది పొడవునా రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా ఐదు కిలోల బియ్యాన్ని సరఫరా చేసిందని తెలిపారు. తెలంగాణలో, మొత్తం 1.92 కోట్ల మందిని కవర్ చేసే 55 లక్షల మంది కార్డ్ హోల్డర్లు, జనవరి నుండి అమలులోకి వచ్చేలా, 4,300 కోట్ల రూపాయల ధరతో 13 లక్షల టన్నుల బియ్యాన్ని పొందవలసి ఉంటుందని.. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లు ఆదా అవుతుందన్నారు. మరో 90 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేసినా రాష్ట్రానికి రూ.80 కోట్ల మిగులు ఆదాయం మిగిలిపోతుంద‌ని బండి సంజ‌య్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి మరియు బాధ్యతారహిత వైఖరి కారణంగా పేద లబ్ధిదారులకు బియ్యం కోటాను ఇంకా విడుదల చేయలేదని సంజయ్ ఆరోపించారు. పండుగ రోజుల్లో ప్రజలు ఆకలితో అలమటించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఉచిత బియ్యం సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏర్పాట్లు చేయలేదని బీజేపీ అధ్యక్షుడు సంజ‌య్ కేసీఆర్‌ని ప్ర‌శ్నించారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో కూడా కేంద్రానికి మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం సరఫరా పథకాన్ని నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను ఉటంకిస్తూ కేంద్రం ప్రజలను ఆకలితో అలమటిస్తున్నదని రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో పేద ప్రజలకు అన్నం పెట్టకుండా చేయడం ఎంత వరకు సమంజసమ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉచిత బియ్యం పథకంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చూడటం దురదృష్టకరమ‌నన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని బలవర్థకమైన బియ్యంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించినందుకు బీఆర్‌ఎస్ నేతలను తప్పుబట్టారు.