Site icon HashtagU Telugu

Bandi Sanjay : బీఎల్ సంతోష్ జోలికొస్తే…పరిస్థితి మరోలా ఉంటుంది…జాగ్రత్త..!!

Bandi Imresizer

Bandi Imresizer

మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటన గురించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీఎల్ సంతోష్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఫాంహౌస్ లు, బ్యాంక్ అకౌంట్లు బీఎల్ సంతోష్ కు లేవన్నారు. బీఎస్ సంతోష్ జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. సంఘ్ ప్రచారక్ లను కేసీఆర్ అవమానిస్తున్నారన్న బండి సంజయ్…రాష్ట్రాన్ని రక్షించేందుకు సంఘ్ ప్రచారక్ లు పనిచేస్తున్నారన్నారు. బీఎల్ సంతోష్ పదవులు ఆశించలేదన్నారు. స్కాం నుంచి బయటపడేందుకు బీఎల్ సంతోష్ ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.