గ్రూప్ 1 ఎగ్జామ్స్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. గ్రూప్-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ అభ్యర్థులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజులుగా వారంతా ఆందోళనలు కొనసాగిస్తూ వస్తుండగా… ఈరోజు ఏకంగా చలో సచివాలయం పిలుపునిచ్చారు. ఈ పిలుపు కార్యక్రమంలో అభ్యర్థుల వెంట బిజెపి , బిఆర్ఎస్ నేతలు కూడా కలవడం తో మరింత వేడెక్కింది. ఈ క్రమంలో బండి సంజయ్ (Bandi Sanjay) ని చర్చలకు సీఎం ఆహ్వానించడం పై కేటీఆర్ (KTR) చురకలు అంటించారు..దీనికి బండి సంజయ్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
గ్రూప్ 1 అభ్యర్థుల తరపున ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు బండి సంజయ్ కి ఏం తెలుసు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంతకీ ఆయన ఏం చదువుకున్నాడని, పరీక్షల గురించి ఆయనకేం తెలుసు.. ఆయనకు తెలిసిందల్లా పేపర్లు లీక్ చేయడమే కదా అని కేటీఆర్ ఎద్దేవా చేసారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తాను పేపర్ లీక్ చేసినట్లు కేటీఆర్ కుటుంబంతో ప్రమాణం చేయిస్తారా అంటూ సవాల్ చేశారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందా సాగించిన బతుకు నీదని , అనవసరంగా తన జోలికి వస్తే నీ చీకటి బతుకును బయటపెడతానని కేటీఆర్ కు హెచ్చరించారు.
Read Also : Navya Haridas : వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్