Site icon HashtagU Telugu

Bandi Sanjay:BRS పార్టీపై బండి సంజ‌య్ హాట్ కామెంట్స్‌..!

Telangana BJP

Sanjay bandi

తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కాస్త.. భారత్‌ రాష్ట్ర సమితి(BRS)గా మారిపోయింది. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధ‌వారం జరిగిన టీఆర్‌ఎస్‌ సర్వ సభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు మాత్రం సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ బీఆర్‌ఎస్‌పై హాట్ కామెంట్స్ చేశారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్విట్ట‌ర్‌ వేదికగా స్పందించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్ గా పేరు మార్చి జాతీయ పార్టీ చేయ‌డం పందికి లిప్‌స్టిక్ వేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తాము ఏమో గేమ్ ఛేంజర్స్ అంటూ ట్విట్ట‌ర్ టిట్లు పేర్కొన్నాడు. కానీ తండ్రి ఏమో నేమ్ ఛేంజర్‌ అయ్యాడు. అల్లిమేట్‌గా ప్ర‌జ‌లే ఫేట్‌ ఛేంజర్స్‌ అంటూ బీఆర్‌ఎస్ పార్టీపై బండి సంజ‌య్‌ వ్యంగ్యంగా స్పందించారు.

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బీఆర్ఎస్ ప‌రిణామంపై స్పందిస్తూ.. పార్టీలు రావడం, మసకబారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ప్రళయం రాబోతోందని ఒకప్పుడు కేసీఆర్‌ చెప్పారు. అదే ఇదే (బీఆర్‌ఎస్‌ ప్రకటన) అంటూ సెటైర్‌ పేల్చారు. అయితే.. భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi), అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం 2001లో ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును బుధ‌వారం భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విష‌యం తెలిసిందే. జాతీయ రాజ‌కీయాల్లో మార్పు కోసం బీఆర్ఎస్ అవ‌త‌రించింద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.