నేడు చేవెళ్లలో(Chevella) బీజేపీ(BJP) ‘‘విజయ సంకల్ప సభ’’ ఘనంగా జరిగింది. ఈ సభకు అమిత్ షా(Amit Shah) ముఖ్య అతిథిగా విచ్చేసారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్(Bandi Sanjay) కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy), పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్య ప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్ చుగ్, మురళీధర్ రావు, సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి.. పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమం మొదలయ్యేముందు మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు అమిత్ షా. అనంతరం మొదట అమిత్ షా సూచన మేరకు బండి సంజయ్ ప్రసంగించారు.
చేవెళ్ల సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై… జై శ్రీరాం… అందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక్క విషయం చెబుతాను.. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నన్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. KCR నన్ను అక్రమంగా అరెస్ట్ చేయించాడు. కార్యకర్తలకు అప్పుడు నేనొక్కటే చెప్పిన, మీరేం భయపడకండి, ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది. పులి వస్తోంది, వేట మొదలైంది, వెంటాడటం ప్రారంభించింది, ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి, ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది, ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి అని అమిత్ షాను ఉద్దేశించి అన్నారు.
అలాగే.. తెలంగాణను అభివ్రుద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే కేసీఆర్ అడుగడుగునా అడ్డుకుంటోంది. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. బీజేపీ అధికారంలోకి వస్తే అభివ్రుద్ధి చేస్తాం. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఫసల్ బీమా అమలు చేస్తాం. ఇండ్లను నిర్మిస్తాం. జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అని అన్నారు.
Also Read : KCR Compete With Modi: మోడీకి పోటీగా కేసీఆర్..! తెలంగాణలో గరుడ గంగా పుష్కరాల చోద్యం..!