Site icon HashtagU Telugu

Triangle Fight In Telangana: బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర: బండి సంజయ్

Bandi sanjay bus yatra

Bandi Padayatra

Triangle Fight In Telangana: ఓ వైపు కాంగ్రెస్ రాజకీయంగా స్ట్రాంగ్ అవుతుంది. మరోవైపు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని తెలంగాణకు రప్పించి తమ బలాన్ని చూపిస్తుంది. ఈ రెండు పార్టీలకు బాస్ బీఆర్ఎస్. ఈ మూడు పార్టీలు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే కాంగ్రెస్ రాజకీయంగా బలంగా తయారవుతున్నప్పటికీ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమని చెప్తున్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్.

వరంగల్ లో బీజేపీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ కు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని విమర్శించారు బండి. ఆ పార్టీలో ఒకరో, ఇద్దరో చేరినంత మాత్రాన ఒరిగేదేమి లేదని పేర్కొన్నారు. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీని ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ గడీలను బద్దలుకొట్టి రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.

ఇక తెలంగాణాలో మూడుముక్కలాట షో నడుస్తుంది. రాష్ట్రంలో సాధారణంగా రెండు పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం తెలంగాణాలో మూడు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉండగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారం కోసం ప్రయత్నిస్తుంది. ఇక బీజేపీ తెలంగాణలో తిష్ట వేసేందుకు ఢిల్లీ నాయకులు సైతం రాష్ట్రానికి వస్తున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న తెలంగాణకు రానున్నారు. జూలై 8న మోడీ వరంగల్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తారు.

Read More: NCP vs NCP : శరద్ పవార్ ఎన్‌సీపీ రెండు ముక్కలు ? 54 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది అజిత్ వెంటే ?