తెలంగాణ ప్రజలు మార్పు కోరకుంటున్నారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిజాం పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. బీజేపీకి రాష్ట్రంలో వస్తున్న ఆదరణ చూసిన కేసీఆర్ లో వణుకు మొదలైందన్నారు. టీఆర్ఎస్ పాలనలో పైసా ఇవ్వనిదే పనికావడంలేదని మండిపడ్డారు బండిసంజయ్.
ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై చీత్కారానికి ముఖ్యమంత్రే కారణమన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందన్న సంజయ్…ప్రపంచం మొత్తం భారత్ ను చూసి గర్వపడుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు చైనాను పొగుడుతున్నారన్న సంజయ్….ఏ స్కాంలోనైనా కేసీఆర్ ఫ్యామిలీ ఉంటుందని ఆరోపించారు.