కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)..హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)..రాహుల్ కు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు కాదు..ఇప్పుడు తెలంగాణ రాహుల్ యాత్ర చేయాలనీ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై యాత్ర చేయాలంటూ సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో అడుగుపెట్టే ముందు ఈ హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో రాహుల్.. తెలంగాణ యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాలకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.
ఈ హామీలను అమలు చేయడం కాదని, కేవలం ప్రచారం కోసమే హామీలు ఇచ్చారని విమర్శించారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు రాహుల్ కు ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాహుల్ గాంధీ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ, ఇప్పటికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటె రేపటి నుండి తెలంగాణ కులగణన సర్వే మొదలుకాబోతుంది. ఈ క్రమంలోనే బీసీ జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల విడుదల చేసింది. బీసీ కులగణనకు డేడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర్ రావును నియమించారు. నెలరోజుల్లో కమిటీ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను శాస్త్రీయమైన పద్ధతిలో తేల్చాలని హైకోర్టు సూచించింది. దీని కోసం 2 వారాల్లో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని అక్టోబర్ 30న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వారం రోజుల్లోనే ఈ కమిషన్ ను నియమించింది. డిసెంబర్ 9లోగా బీసీ కులగణన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also : CM Siddaramaiah : కర్ణాటక సీఎంకు హైకోర్టు నోటీసులు