Bandi Sanjay: ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయిన, గాయపడ్డ వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికే క్రమంలో అత్యుత్సాహం చూపించారు. చుట్టు ప్రక్కల గమనించకుండా బాణాసంచా కాల్చారు. దాంతో తారాజువ్వ ఎగిరి పక్కన ఉన్న గుడిసెపై పడింది. దాంతో భారీగా మంటలు చెలరేగాయి. గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఆ ప్రదేశమంతా అగ్ని శకలాలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు కాళ్లు చేతులు తెగి పడ్డాయి. ఇద్దరు మరణించారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పోలీసులు , జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
ఈ ప్రమాద ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. ఘటనపై బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో గులాబీ నేతల నిర్లక్ష్యం కారణంగా బాణాసంచా నిప్పు రవ్వలు ఓ గుడిసెపై పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. క్షతగాత్రులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలి. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సాయం అందించాలి. ఈ ఘటనకు బాధ్యులైన బిఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టి, కఠినంగా శిక్షించాలి అంటూ ట్వీట్ చేశారు.
Read More: BRS Meeting: బీఆర్ఎస్ ఆత్మీయ సభలో విషాదం…