Bandi Sanjay: ‘హుస్సేన్ సాగర్’ను ‘వినాయక సాగర్’ గా మార్చేసిన బండి!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గణేష్ ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Bandi

Bandi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గణేష్ ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన ఆయన ‘హుస్సేన్ సాగర్’ను ‘వినాయక సాగర్’ అని సంబోధించారు. “ప్రతి సంవత్సరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది’’ బండి అని ఆరోపించారు.

“రెండు రోజుల్లో పెద్దఎత్తున నిమజ్జనాలు జరగనున్నాయి, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉదయం కొన్ని క్రేన్లు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. గతేడాది సుమారు 60 క్రేన్లను ఏర్పాటు చేశారు. హిందువులు ఈ పరిస్థితి గురించి ఆలోచించాలి”  అని బండి సంజయ్ అన్నారు. గతంలో హైదరాబాద్, చార్మినార్ పేర్ల మార్పు గురించి డిమాండ్ చేసిన సంజయ్, తాజాగా హుస్సేన్ సాగర్ ను వినాయక సాగర్ గా నామకరణం చేయడం చర్చనీయాంశమవుతోంది.

  Last Updated: 08 Sep 2022, 05:36 PM IST