Site icon HashtagU Telugu

Bandi Sanjay : ఈరోజు సెలవు ప్రకటించడం…తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినట్లే..!!

Telangana BJP

Sanjay bandi

ఈరోజు సెలవు ప్రకటించి…తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో మంతి ఆత్మబలిదానాలు, సర్ధార్ పటేల్ క్రుషి ఫలితంగా తెలంగాణ దేశంలో విలీనం అయ్యింది. ఎన్నో ఏండ్ల తర్వాత అధికారికంగా మనం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చినాకే తెలంగాణకు వచ్చింది. నిజాం, రజాకార్ల చేతిలో తెలంగాణ ప్రజలు చిత్ర హింసలకు గురయ్యారని తెలిపారు. తెలంగాణను పాకిస్తాన్ లో కలుపుతారా లేదా ఒంటరి దేశంగానే ఉంచుతామన్నాడు నిజాం అని మండిపడ్డారు. రాష్ట్రం అర్థంపర్ధం లేని సమైక్యతి దినోత్సవాలు జరుపుతోంది. ఇన్ని రోజులు చేయని వేడుకలు ఇప్పుడెందుకు జరపుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించడం అవమానించినట్లే అన్నారు. సెలవు ప్రకటించకుండా వేడుకలు జరుపుకోవాలని ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు బండి సంజయ్.