Bandi Sanjay MP Ticket Fight : ‘బండి సంజయ్ కి ఎంపీ టికెట్ ఇవ్వొద్దంటున్న సీనియర్లు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..ఇక త్వరలో లోక్ సభ (Parliament Election 2024) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుండే ఆ ఎన్నికల ఫై కసరత్తులు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ డంఖా మోగించామో..అదే విధంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ (Congress) భావిస్తుంది. ఈ క్రమంలో ఎవరికీ టికెట్ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం చూస్తుంది. ఇక బిఆర్ఎస్ (BRS) సైతం లోక్ సభ […]

Published By: HashtagU Telugu Desk
Mp Ticket

Mp Ticket

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..ఇక త్వరలో లోక్ సభ (Parliament Election 2024) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుండే ఆ ఎన్నికల ఫై కసరత్తులు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ డంఖా మోగించామో..అదే విధంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ (Congress) భావిస్తుంది. ఈ క్రమంలో ఎవరికీ టికెట్ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం చూస్తుంది. ఇక బిఆర్ఎస్ (BRS) సైతం లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి..తమ సత్తా చాటాలని చూస్తుంది. ఇక బిజెపి (BJP) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త పర్వాలేదు అనిపించే స్థానాలు దక్కడంతో లోక సభ ఎన్నికల ఫై మరింత దృష్టి పెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ టికెట్ బండి సంజయ్ (Bandi Sanjay MP Ticket ) కి ఇవ్వదంటూ సీనియర్లు అధిష్టానానికి తెలిపినట్లు వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఒంటెద్దు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టించారని వారంతా వాపోయారట. రీసెంట్ గా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసి.. బండి సంజయ్ కు ఈ సారి టికెట్ ఇవ్వొద్దని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ వ్యవహారశైలి వల్ల చాలా మంది ప్రచారానికి కూడా రాలేదని.. సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. ప్రధాని మోడీ పర్యటన సమయంలోనూ సీనియర్లను ఆహ్వానించలేదని, ఆయన ఒంటెద్దు పోకడలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయని వారు చెప్పినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా గెలిచారని, కరీంనగర్ లో మరో ప్రత్యామ్నాయం ఎవరని బండి సంజయ్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీకి ఉనికే లేదనుకున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని..అలాంటి ఆయనకు టికెట్ ఇవ్వదని చెప్పడం సరికాదని వారంతా వాపోతున్నారు. మరి అధిష్టానం బండి సంజయ్ కి టికెట్ ఇస్తుందా..? లేదా..? అనేది చూడాలి.

Read Also : Ex Mla Guvvala Balaraju Arrest : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు

  Last Updated: 18 Dec 2023, 02:20 PM IST