Site icon HashtagU Telugu

Bandi Sanjay: అలా చేస్తేనే ఇస్తాం.. ఇందిర‌మ్మ ఇండ్లు, రేష‌న్ కార్డుల‌పై బండి సంజ‌య్‌ కీల‌క వ్యాఖ్య‌లు!

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎప్పుడు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల‌పై మండిప‌డే బండి తాజాగా ప‌థ‌కాల‌పై స్పందించారు. రేప‌ట్నుంచి రేవంత్ స‌ర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప‌థ‌కాల‌పై బండి సంజ‌య్ పెద్ద బాంబే పేల్చారు. ఈ సంద‌ర్భంగా క‌రీంన‌గ‌ర్‌ల్ మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధికి సహాకరించి నిధులు తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వమే అని తెలిపారు. పది‌ సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డామ‌ని, గ‌త ఐదేండ్లలో ఎంపీగా ఉన్న త‌న‌ను బీఆర్ఎస్ తొక్కేందుకు ప్ర‌య‌త్నించింద‌ని మండ‌ప‌డ్డారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధుల‌న్నీ గ‌త ప్ర‌భుత్వం మూడేండ్లు ఆపింద‌ని గుర్తుచేశారు. బీఅర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకి అడ్టగా మారిందని విమ‌ర్శించారు.

Also Read: Mohammed Shami: రెండో టీ20.. టీమిండియాలోకి మహ్మద్ షమీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా?

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే పనిచేస్తుంద‌ని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పనితనంలో కొత్త మార్పేమి లేదని దుయ్య‌బ‌ట్టారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అస‌లు పత్తా లేదన్నారు. అనేక రకాల కేసులతో ప్రజల దృష్టి మారుస్తున్నారు త‌ప్పితే కేసులు కొలిక్కి రావ‌డంలేద‌ని అన్నారు. ఈ ఫార్ములా కేసులో ఆధారాలు ఉంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయ‌టంలేద‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణకి ఆదాయం ఇచ్చే గ్రీన్ కో సంస్థపై దాడులేంది? అని ప్ర‌శ్నించారు. డబ్బులు ముట్టలేదా రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. దావోస్‌లో ఎంఓయూ చేసుకుంటే 2014 నుండి ఇప్పటివరకి ఒప్పందాలు జరిగాయా? పెట్టుబ‌డులు వస్తే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్‌కు ఉందా? అని అడిగారు. ఈ ఫార్ములా కేసు నుండి దృష్టి మరల్చడానికే దావోస్ పర్యటన అని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

ఇందిర‌మ్మ ఇండ్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు

ఇక‌పోతే తెలంగాణ ప్ర‌భుత్వం రేపట్నుంచి మొద‌లుపెట్ట‌నున్న నాలుగు ప‌థ‌కాల‌పై బండి సంజ‌య్ స్పందించారు. ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు పెడితే ఒక్క రూపాయి, ఒక్క ఇళ్లు కూడా కేంద్రం ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే ఇండ్ల‌కు డబ్బులు మంజూరు చేస్తామ‌ని తెలిపారు. అదే విధంగా కొత్త రేష‌న్ కార్డుల‌పై కాంగ్రెస్ ఆన‌వాళ్లు ఉండే ఫొటోలు పెడితే రేష‌న్ కార్డులు కూడా ఇవ్వ‌బోమ‌ని అన్నారు. అవ‌స‌రం అయితే కేంద్ర‌మే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులతోపాటు రేష‌న్ బియ్యం ఇస్తుంద‌ని తెలిపారు.