Site icon HashtagU Telugu

Bandi Sanjay : గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో మీ ఆఫీసుకు తీసుకుస్తా…డీజీపీకి ఫోన్ లో డెడ్ లైన్…వైరల్ వీడియో..!!

Bandi Dgp

Bandi Dgp

జనగామ జిల్లా దేవరుప్పలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ  టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఏం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర నుంచే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. తమపైదాడులు జరుగుతుంటే కమిషనర్ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలు ఇద్దరికి తలలకు గాయాలయ్యాయి అన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడి విషయంలో పోలీసులు స్పందించకపోతే కార్యకర్తలను పదినిమిషాల్లో మీ కార్యాలయానికి తీసుకువస్తా సీఎం ను రమ్మనండి అంటూ డీజీపీకి డెడ్ లైన్ విధించారు.