Site icon HashtagU Telugu

TS : మునుగోడుకు బండి సంజయ్..హోరెత్తనున్న ప్రచారం !!

Bandi Sanjay

Bandi Sanjay

మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీ పోటాపోటిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే మునుగోడులో అధికారపార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ ప్లాన్ రచిస్తోంది. ఎలాగైనా ఈ ఉపఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

కాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 18 నుంచి 23 వరకు మునుగోడులో జరిగే ప్రచారంలో బండి సంజయ్ పాల్గొంటారు. ఈనెల 18 నుంచి మర్రిగూడెం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. 23 వరకు నియోజకవర్గం మొత్తం రోడ్ షోలో నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ నేతలంతా ఈ రోడ్ షోలో పాల్గొనున్నరు.

Exit mobile version