ఇటీవల పార్లమెంట్(Parliament) లో మాట్లాడుతూ ప్రధాని మోడీ(PM Modi) ఏపీ విభజనని కూడా ప్రస్తావించి ఏపీ విభజన సరిగ్గా జరగలేదని, ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని కాంగ్రస్ పై కౌంటర్లు వేశారు. బీజేపీ(BJP) సమయంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విభజన జరిగిందని అన్నారు. దీంతో మోడీ వ్యాఖ్యలను కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నాయకులు విమర్శిస్తున్నారు.
తాజాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ(Telangana) అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే అని రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. అయితే దీనికి కౌంటర్ ట్వీట్ గా బండి సంజయ్ ఇంగ్లీష్ లో ట్వీట్ చేయడం విశేషం.
బండి సంజయ్(Bandi Sanjay).. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పుజీ. 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తుంది. ఒకే ఓటు – రెండు రాష్ట్రాలు అని తొలిసారి పిలుపునిచ్చింది అటల్ బిహారీ వాజ్‌పేయి. మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసింది. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి? జవహర్‌లాల్ నెహ్రూ – జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారు. ఇందిరా గాంధీ – 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని రాజీవ్ గాంధీ 1985లో హామీ ఇచ్చారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది భాజపా ప్రభుత్వం అని తెలిసి బిల్లును ప్రవేశపెట్టారు అంటూ ఫైర్ అయ్యారు. దీంతో మరోసారి తెలంగాణ అంశం చర్చగా మారింది. తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఇలాంటి చర్చ రావడంతో నాయకులు తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ పైకి ఎత్తుకుంటున్నారు.