Bandi Sanjay : కరీంనగర్ లో నామినేషన్ వేసిన బండి సంజయ్

ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు

Published By: HashtagU Telugu Desk
Bandi Sanjay Files Nomination From Karimnagar

Bandi Sanjay Files Nomination From Karimnagar

కరీంనగర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి (Karimnagar BJP Candidate) గా బండి సంజయ్ నామినేషన్ దాఖలు (Bandi Sanjay nomination) చేశారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని చెప్పారు. తన నామినేషన్ సందర్భంగా కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కూడా ఇందులో పాల్గొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణవ్యాప్తంగా రెపరెపలాడించానన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కరీంనగర్ మొత్తం కాషాయమైందన్నారు. ఇంతమంది ఎందుకొచ్చారు..? ధర్మం కోసమా..? కాదా..? కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగరేద్దాం.. ధర్మాన్ని నిలబెడదామని బండి పిలుపునిచ్చారు. మా చేతిలో ఉండేది కాషాయ జెండానే. మీరిచ్చిన కాషాయ జెండాను కొందరు మర్చిపోయారని బండి గుర్తుచేశారు.

అలాగే బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) మాట్లాడుతూ..ధర్మం కోసం, ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా? అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారా? తేల్చుకోవాలని రాజాసింగ్ అన్నారు. బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని సెటైర్లు వేశారు.

Read Also : Israel Hamas War: 31 రోజుల్లో 10 వేల మంది మృతి,15 లక్షల మంది నిరాశ్రయులు

  Last Updated: 06 Nov 2023, 02:55 PM IST