Site icon HashtagU Telugu

Bandi Sanjay: బండి సంజయ్ పై జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు

Telangana BJP

Sanjay bandi

నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేశా శర్మకు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి చేసిన మహిళ ఎమ్మెల్సీ కవిత అని తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ కోసం 4 కోట్ల మంది ప్రజల అకాంక్ష కోసం ఉద్యమించిన ధీరవనిత అన్నారు. అలాంటి ఆడపడుచుపై నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కించపరిచే విధంగా ఈడీ అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని పరుష పదజాలంతో మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Amit Shah: వాషింగ్‌ పౌడర్‌ నిర్మా హోర్డింగ్స్‌తో అమిత్‌ షాకు ఆహ్వానం

అసలు మహిళ రిజర్వేషన్ కోసం కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ఉద్యమాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని విమర్శించారు. సంజయ్ మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ మహిళలు, ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ నేడు రోడ్డెక్కి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఓ మహిళ ప్రజాప్రతినిధి అని చూడకుండా పరుష పదజాలంతో దూషించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పైచర్యలు తీసుకోని మహిళ హక్కులను కాపాడే విధంగా అలాగే మరొకరు ఈ విధంగా మహిళను అగౌరవ పరిచేవిధంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ కోరినట్లు తెలిపారు.