Site icon HashtagU Telugu

Telangana Assembly Polls: హైదరాబాద్ నుండి బయటకు వచ్చే దమ్ముందా?

Telangana Assembly Polls

Telangana Assembly Polls

Telangana Assembly Polls: ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణాలో ఈ సారి మరింత టఫ్ ఫైట్ జరగనుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధం అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కరీంనగర్ లో పర్యటించిన బండి సంజయ్ ఎంఐఎం పార్టీని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీకి సవాల్ విసిరారు.

ఏఐఎంఐఎం పార్టీ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌. ఏఐఎంఐఎం నిజంగానే మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే, పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తే, మీరు మనుషులైతే, మీకు దమ్ము ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయండి. నువ్వు హైదరాబాద్ బయటకి ఎందుకు రావడం లేదని పార్టీ చీఫ్ అసదుద్దీన్ ని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్.

హైదరాబాద్‌కే పరిమితమై ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి డబ్బును స్వీకరించాలనుకుంటే అలా చేయండి. ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని అంగీకరించదు అని ఆరోపించారు. ఎంఐఎం ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఏఐఎంఐఎం పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ముస్లిం సమాజం కూడా సిద్ధంగా ఉంది అని అన్నారు. ఓల్డ్ సిటీ ప్రజలు, మరియు నాయకులు చాలామంది నాతో మాట్లాడారని చెప్పారు. బీజేపీ పాత నగరాన్ని కొత్త నగరంగా మార్చాలనుకుంటున్నది. మజ్లీస్ పాత నగరాన్ని ఎందుకు కొత్త నగరంగా చేయడం లేదు? మీకు దమ్ము ఉంటే దీనికి సమాధానం చెప్పండని సవాల్ చేశారు.

Also Read: Train Accident: నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. 6 మృతి