వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను సభ్యులుగా చేర్చాలని మోడీ ప్రభుత్వం (Modi Govt) బిల్లు తెచ్చిందని.. టీటీడీలో మాత్రం అందరూ హిందువులే ఉండాలని అంటున్నారని, హిందువులకు టీటీడీ పవిత్రమైనప్పుడు, ముస్లింలకు వక్ఫ్ బోర్డు కూడా అంతే పవిత్రం, అలాంటి చోట ఇతరులను ఎలా అనుమతిస్తారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన కామెంట్స్ పై బండి సంజయ్ (Bandi Sanjay)ఆగ్రహం వ్యక్తం చేసారు.
తిరుమల బోర్డ్‌కి, వక్ఫ్ బోర్డ్‌కి తేడా తెలియని అజ్ఞాని అసద్ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ వైకుంఠాధీశుడు కొలువైన పరమ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. మీరు ప్రార్ధించే మక్కా మసీదు కూడా కాదు.. అంటూ బండి సంజయ్ అసదుద్దీన్ పై మండిపడ్డారు. వక్ఫ్ భూములు పేద ముస్లింలకు చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు త్వరలోనే ప్రజల ముందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్‌తో అంటకాగేందుకు MIM తంటాలు పడుతోందంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also : 4000 Year Old Town : ఒయాసిస్ మాటున.. 4వేల ఏళ్ల కిందటి పట్టణం