మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay ) మరోసారి తనదైన స్టయిల్ లో బిఆర్ఎస్ (BRS) ఫై మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ లో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి నేతలు చేయని ప్రయత్నం లేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో ప్రధాని మోడీ (PM Modi) దగ్గరి నుండి కేంద్ర మంత్రులు వరుస తెలంగాణ పర్యటనలు ప్లాన్ చేస్తూ..కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. రీసెంట్ గా ప్రధాని మోడీ నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే క్రమంలో అధికార పార్టీ బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై పలు విమర్శలు చేసారు. ఈ విమర్శలకు బిఆర్ఎస్ సైతం కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో బండి సంజయ్ బిఆర్ఎస్ ఫై విరుచుకపడ్డారు. ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ ఫై మంత్రి కేటీఆర్ (KTR) విషాన్ని నింపుకున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ (KCR) ఇంట్లోకి రానివ్వడం లేదని..కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు. గత 15 రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM Missing) కనిపించడం లేదని, కేసీఆర్ మిస్సింగ్ తమను ఆందోళనకు గురిచేస్తోందని సెటైర్లు వేశారు. కేసీఆర్ దగ్గరకు ఎవరనీ వెళ్లనీయడం లేదని, చివరికి ఎంపీ సంతోష్ కుమార్‌ను కూడా దూరం పెట్టారని విమర్శించారు. కేటిఆర్ భాష చూసి తెలంగాణ సిగ్గు పడుతుందని..బిడ్డా కేటీఆర్.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే.. తట్టుకోలేవ్’’అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. కేటీఆర్ సీఎం అభ్యర్థి అయితే.. ఎమ్మెల్యేలు బయటకు వస్తారని బండి సంజయ్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిజామాబాద్ సభలో చేసిన మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 2009లో ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా అని నిలదీశారు. ‘ఉద్యమ సమయంలో తండ్రిని చంపేస్తారా మాకేమొస్తుందని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు జై తెలంగాణా అని మంత్రి పదవిలో కూర్చుండు. ఇంతకంటే చీటర్ ఇంకెవరుంటారు. ఉద్యమ సమయంలో మీ ఆస్తులెంత..? ఇప్పుడు మీ ఆస్తులెంత..? తెలంగాణా సమాజం కేసీఆర్ కుటుంబం ఆస్తులు కొల్లగొడుతున్న విధానాన్ని గమనించాలి’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని అనేకసార్లు బయటపడిందన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో జాయిన్ అవుతారని అన్నారు.
Read Also : BRS Minister: కేసిఆర్ పై మోడీ అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు: మంత్రి ప్రశాంత్ రెడ్డి