Bandi Sanjay Challenge: తగ్గేదేలే..చూసుకుందాం రా.. కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్..!!

ధర్మం కోసం టీఆర్ఎస్ పై యుద్దం మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

Published By: HashtagU Telugu Desk
Telangana BJP

Sanjay bandi

ధర్మం కోసం టీఆర్ఎస్ పై యుద్దం మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తాను చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పీడీయాక్ట్ కు ధర్మపరిరక్షకులు భయపడరని…సభను అడ్డుకోవాలని ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు.

మేం సామ జగన్మోహనరెడ్డి వారసులుగా వస్తున్నాం…నువ్ నిజాం వారసుడిగా రా..

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేం సామ జగన్మోహనరెడ్డి వారసులుగా వస్తున్నాం…నువ్ నిజాం వారసుడిగా రా…తేల్చుకుందాం అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. అభివ్రుద్ధిపై చర్చకు మేము సిద్ధం…మోదీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో మేము వివరిస్తామన్నారు. ధర్మం కోసం పాటుపడేవారు దేనికి భయపడరన్నారు. తెలంగాణ సమాజం కోసం తాము పనిచేస్తున్నామని…కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 14వందల మంది ఆత్మబలిదానాలు చేస్తే…చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లుగా కేసీఆర్…ఆయన కుటుంబ సభ్యులు అధికారంలోకి వచ్చి ఎంత ద్రోహం చేసిందో ప్రజలు గమనించాలన్నారు.

బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతోంది

బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతోందంటూ కేసీఆర్ కొత్త రాగం ఎత్తుకున్నారు..ఎక్కడ రెచ్చగొట్టాం..ఎప్పుడు రెచ్చగొట్టమో …కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకటి రెండు, మూడు పాదయాత్రలను విజయవంతంగా పూర్తి చేశాను. మా కార్యకర్తల కాళ్లు, చేతులు విరగొట్టి నువ్వు….ఎక్కడైతే పాదయాత్రను అడ్డుకున్నావో…అక్కడి నుంచే మళ్లీ యాత్ర షురూ చేసి భద్రకాళి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తానంటూ చెప్పాను వచ్చాను అంటూ ప్రసంగించారు సంజయ్.

 

  Last Updated: 27 Aug 2022, 09:06 PM IST