Site icon HashtagU Telugu

Bandi Sanjay : రాహుల్ కి ఛాలెంజ్ విసిరిన బండి సంజయ్

Bandi Sanjay Rahul

Bandi Sanjay Rahul

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం మరింత ఊపందుకుంది. ఎవరికీ వారే తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ తమ హామీలను తెలుపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే ఇరు పార్టీల నేతలు సైతం ఒకరి ఫై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం లో పాల్గొని బిఆర్ఎస్ (BRS) , బిజెపి (BJP) లపై నిప్పులు చెరిగారు.

ప్రచారంలో అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలఫై బిజెపి నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందన్నారు. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే. అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్ అన్నారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీసీలకు ఓట్లు అడగాలని బండి సంజయ్ అన్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల నుండి ఆ తరువాత అన్ని ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లను, ఓట్లను సాధించిన పార్టీ బీజేపీ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ… తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీసీ నాయకుడిని సీఎం చేయడం ఖాయమన్నారు. ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? అని సవాల్ చేసారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకిి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ ను బీసీలే రాజకీయ సమాధి చేయడం తథ్యం అన్నారు.

Read Also : Lavanya : ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు సినిమాలు చేస్తుందా..?