Site icon HashtagU Telugu

Bandi Sanjay: 2024 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్

Telangana BJP

Sanjay bandi

రాష్ట్రంలో బిజెపి సంస్థాగత ఎన్నికలు 2024లో జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ (Bandi Sanjay)ను కొనసాగిస్తారని పార్టీ వర్గాల సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలోనే బిజెపి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతుంది. మరోవైపు బండి సంజయ్ ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్ర మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు విడతల్లో 50 పైగా నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్రను పూర్తి చేశారు.

Also Read: T20 Semi Finals: కొంపముంచిన రనౌట్లు… సెమీస్ లో భారత్ ఓటమి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ నేతృత్వంలో ప్రజాగోస బిజెపి భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహిస్తోంది. ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100కు తగ్గకుండా సభలు జరపనున్నారు. ఈ సమావేశాలకు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారు.