Site icon HashtagU Telugu

Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ

Etela Bandi

Etela Bandi

బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ నడుస్తుందని అంత మాట్లాడుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ..ఈటలకి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈటల రమ్మనలేదు కాబట్టే రాలేదన్నారు. ఓడిపోయే వారే ఇంట్లో ఉంటారు.. గెలుస్తా కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే మీఅంసంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మేము చేసిన అభివృద్ధి, దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎన్నికలకు వెళ్తామన్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి రావాలి అపుడే దేశం అభివృద్ధి అన్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లకు, 500గ్యాస్ సిలిండర్ హామీలకు మీము వ్యతిరేఖం కాదు..కానీ కొర్రీలు పెట్టద్దని అన్నారు. మ్యానిఫెస్టోలో రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకే అని చెప్పలేదు అందరికి స్కీంలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వాలని, వారం రోజుల్లో ఇవ్వచ్చని తెలిపారు.నిజాయితీ ఉంటే 6 గ్యారంటీలను ఎన్నిక ల షెడ్యూల్ లోపల అమలు చేయాలన్నారు. ఎకరానికి 15 వేలు,మహిళలు కు 2500, పెన్షన్, ఇళ్ల స్థలాలు, 2 లక్షల రుణమాఫీ, నోటిఫికేషన్ ,317 జిఓ, నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు. ఇవి నెరవేర్చడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో చెప్పాలన్నారు. అప్పుల రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పాలన్నారు.

Read Also : Jana Sena Symbol : జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌..