Site icon HashtagU Telugu

Bandi Sanjay: ప్రజా క్షేత్రంలోకి బండి.. నిర్మల్ నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ షురూ!

Bandi (1)

Bandi (1)

కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆయన చేపట్టిన యాత్రకు బీజేపీ పెద్దల నుంచి కాకుండే తెలంగాణ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే నాలుగు దశలుగా పాదయాత్రలు నిర్వహించి మరోసారు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఐదవ దశ ప్రజా సంగ్రామం యాత్ర నవంబర్ 28 న ప్రారంభమవుతుంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ నిర్మల్ జిల్లా నుంచి అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐదో దశ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కరీంనగర్‌లో ముగింపు సభ జరగనుంది. డిసెంబర్ మధ్య వరకు పాదయాత్ర కొనసాగనుంది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 బైక్ లతో ర్యాలీ నిర్వహించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు బైక్ ర్యాలీలు కొనసాగనున్నాయి. నిత్యం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి స్థానిక సమస్యల గురించి నేతలు తెలుసుకోనున్నారని యాత్ర ఇంఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు. బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామం యాత్ర నాలుగు దశలను ఘనంగా ముగించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుటుంబ-అవినీతి-నియంత పాలనను వ్యతిరేకిస్తూ  ఆయన ఆయన యాత్ర చేశారని, 21 జిల్లాల్లోని 13 లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,178 కిలోమీటర్ల మేర నడిచారని బీజేపీ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఎమ్మెల్యే వేట కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంపై బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది.