Site icon HashtagU Telugu

Bandi Ramesh : కూకట్ పల్లి కాంగ్రెస్ బరిలో బండి రమేష్ ..?

kukatpally congress candidate

kukatpally congress candidate

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు చేరుతూ..టికెట్ ను ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటీకే పలువురు నేతలు చేరగా…తాజాగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేత , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ (Bandi Ramesh) బీఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసి , కాంగ్రెస్ గూటికి చేరారు. నేడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ప్రస్తుతం శేరిలింగం పల్లి నుంచి బీఆర్ఎస్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు గ్రేటర్ మేయర్ పదవిని ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఆయన.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కొరత ఉండటం సామాజిక వర్గ పరంగా కలసి వచ్చే నేత కావడంతో బండి రమేష్ కు టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా బిఆర్ఎస్ కీలక నేతలు పార్టీ ని వీడి, కాంగ్రెస్ లో చేరుతున్నారు.

Read Also : Telangana Election Effect : రంగంలోకి 20 వేల కేంద్ర బలగాలు